తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ పగ్గాలు.. మళ్లీ  రాహుల్​ గాంధీకే! - రాహుల్​ గాంధీ

కాంగ్రెస్​ పగ్గాలను మళ్లీ రాహుల్​ గాంధీకే అప్పగించాలనే ఒత్తిడి ఆ పార్టీలో మొదలైంది. 2020లోనే ఆయన సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Congress
కాంగ్రెస్​ పగ్గాలు.. మళ్లీ  రాహుల్​ గాంధీకే!

By

Published : Dec 26, 2019, 6:52 AM IST

Updated : Dec 26, 2019, 7:27 AM IST

కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగిన రాహుల్‌గాంధీ (రాగా)నే తిరిగి అధ్యక్షుడిగా తీసుకురావాలనే ఒత్తిడి ఆ పార్టీలో మొదలైంది. 2020లోనే ఆయన పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో దిల్లీ శాసనసభ ఎన్నికల తర్వాత ‘రాగా’కు పగ్గాలు అప్పగించాలని కొందరు, నవంబరులో బిహార్‌ ఎన్నికలకు ముందు ఆ పనిచేస్తే మంచిదని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడి స్థానంలో లేకపోయినా పార్టీలో ఆయన ప్రాధాన్యం చెక్కుచెదరలేదు.

ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. భాజపాకి దీటైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని చెప్పేందుకు ఇదే సరైన తరుణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి తరుణంలో సాధ్యమైనంత త్వరగా ఏఐసీసీ పగ్గాలను రాహుల్‌కు పూర్తిస్థాయిలో అప్పగిస్తే మంచిదని పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.

ఇదీ చూడండి: బోర్డు పునర్‌వ్యవస్థీకరణతో పట్టాలపైకి... రైల్వే!

Last Updated : Dec 26, 2019, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details