తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనం న్యాయ్​' - న్యాయ్​

రాజస్థాన్​ ధోల్​పూర్​ ఎన్నికల ప్రచారంలో రాహుల్​ గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్​ ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకం 'న్యాయ్​' దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా పనిచేస్తుందని విశ్లేషించారు. మోదీకంటే మెరుగైన పాలన అందిస్తామని చెప్పారు.

'దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనం న్యాయ్​'

By

Published : Apr 29, 2019, 6:53 PM IST

'న్యాయ్​'పై రాహుల్​

కాంగ్రెస్ ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకం 'న్యాయ్​'... దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా పనిచేయనుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 22 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

రాజస్థాన్​ ధోల్​పూర్​లోని సిపాయూ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్​. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని బ్యాంకు ఖాతాలు తెరిపించారు.. కానీ డబ్బులు వేయలేదని రాహుల్​ దుయ్యబట్టారు. తాము అధికారం చేపట్టిన ఐదేళ్లలో కచ్చితంగా 3లక్షల 60 వేల రూపాయలను మహిళల బ్యాంకు ఖాతాల్లో వేస్తామన్నారు. ధనికులకు ప్రధాని సహాయం చేస్తుంటే...​ పేదలకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు రాహుల్​.

మే 16న రాజస్థాన్​లోని 11 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ధోల్​పూర్​ ఒకటి.

ఇదీ చూడండి: 'సార్వత్రికం' 4వ దశలో 58.22% ఓటింగ్​

ABOUT THE AUTHOR

...view details