రఫేల్ తీర్పుపై తన వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్థులు తప్పుగా ఆపాదించారని సుప్రీంకోర్టుకు వివరించారు రాహుల్ గాంధీ. రఫేల్ వ్యవహారంలో భాజపా ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై సుప్రీం కోర్టు వివరణ కోరగా.. రాహుల్ అఫిడవిట్ సమర్పించారు.
రాహుల్ గాంధీ ఆపాదించిన 'చౌకీదార్ చోర్ హై' అనే అభ్యంతరకర వ్యాఖ్యలు రఫేల్ తీర్పులో ఎక్కడా ప్రస్తావించలేదని ఈ నెల 15న సుప్రీం స్పష్టం చేసింది. భాజపా ఎంపీ మీనాక్షి వేసిన పిటిషన్పై ఈ నెల 22 లోపు వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీకి నోటీసులిచ్చింది. రాహుల్ ప్రమాణ పత్రంపై మంగళవారం విచారణ జరగనుంది.