భారతీయ నటుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశం సుపుత్రుడిని కోల్పోయిందన్నారు. తన రచనలు, నటన రూపంలో గిరీశ్ బతికే ఉంటారని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు రాహుల్.
"నాటకాల రచయిత, నటుడు, దర్శకుడు అన్నింటికి మించి ఓ మంచి మనిషి గిరీశ్ కర్నాడ్ మృతి బాధాకరం. దేశం ఓ సుపుత్రుడిని కోల్పోయింది. ఆయన చేసిన సృజనాత్మక పనుల రూపంలో కర్నాడ్ గుర్తుండిపోతారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
కర్నాడ్ మృతి పట్ల కాంగ్రెస్ నేతలు శశిథరూర్, రణ్‌దీప్ సుర్జేవాలా విచారం వ్యక్తం చేశారు.
సాంస్కృతిక వారధిని కోల్పోయాం: కుమారస్వామి
కర్నాడ్ మృతిపట్ల స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సాంస్కృతిక వారధిని కోల్పోయామని ట్వీట్ చేశారు.