తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇలాంటివి చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది: రాహుల్​ - china-india

చైనా దురాక్రమణలపై మరోసారి కేంద్రాన్ని విమర్శించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. మోదీ ప్రభుత్వం నిజాలను దాస్తూ.. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఉద్ఘాటించారు. ఈ మేరకు.. తన మైక్రోబ్లాగ్​లో నాలుగో వీడియోను విడుదల చేశారు రాహుల్​.

Rahul Gandhi claims China has occupied Indian land, "allowing them to take it is anti-national"
'ఇలాంటివి చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది'

By

Published : Jul 27, 2020, 1:34 PM IST

భారత్​-చైనా సరిహద్దు అంశమై కేంద్రంపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. భారత భూభాగాన్ని ఆక్రమించుకునేలా చైనాకు అవకాశమివ్వడం.. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడమేనని, కేంద్రం నిజాన్ని దాస్తోందని ఆరోపించారు.

ఈ మేరకు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ... తన మైక్రోబ్లాగింగ్​ సైట్​లో మరో వీడియోను విడుదల చేశారు రాహుల్​. సరిహద్దు ఉద్రిక్తతలపై రాహుల్​.. వీడియో విడుదల చేయడం ఇది నాలుగోసారి. అంతకుముందు జులై 17,20,23 తేదీల్లోనూ మోదీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

''చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది. నిజాన్ని దాస్తూ.. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించింది. దీనిని ఇప్పుడు ప్రజల దృష్టికి తీసుకొచ్చి.. దేశభక్తిని చాటుకొనే ప్రయత్నం చేస్తోంది.''

- రాహుల్​ గాంధీ ​, కాంగ్రెస్​ అగ్రనేత

చైనా దళాలు చొచ్చుకురావడం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు రాహుల్​. అసలు వేరే దేశ సైన్యం.. భారత్​లోకి ఎలా ప్రవేశించగలదని ప్రశ్నించారు. ఇలాంటివి చూస్తుంటే తన రక్తం మరిగిపోతోందని పేర్కొన్నారు కాంగ్రెస్​ నేత.

''రాజకీయాల్లో ఉంటూ మౌనంగా కూర్చోలేను. ప్రజలకు అబద్ధం చెప్పలేను. నేను శాటిలైట్​ ఫొటోలు చూశాను. ఆర్మీ మాజీ అధికారులతో మాట్లాడాను. చైనా.. భారత భూభాగంలోకి రాలేదని మీరు నమ్మించే ప్రయత్నాలు చేసినా నేను నమ్మను. నా రాజకీయ జీవితం ఏమైనా.. నేను అబద్ధం చెప్పలేను.''

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించలేదని చెప్పేవారు జాతీయ వాదులు కాదని, వారికి దేశ భక్తి లేదని మండిపడ్డారు రాహుల్​.

ఇటీవలి కాలంలో భారత్​,చైనా మధ్య గల్వాన్​ లోయలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. సుదీర్ఘ.. సైనిక, దౌత్య స్థాయి చర్చల అనంతరం బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చిన అనంతరం.. పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.

ABOUT THE AUTHOR

...view details