తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని మోదీకి రాహుల్​, భాజపా నేతల శుభాకాంక్షలు - రాహుల్​ గాంధీ ప్రధాని మోదీ

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 70వ పుట్టిన రోజు సందర్భంగా భాజపా నేతలు, కార్యకర్తల నుంచి మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

BJP leaders wish PM on his birthday
ప్రధాని మోదీకి రాహుల్​, భాజపా నేతల శుభాకాంక్షలు

By

Published : Sep 17, 2020, 10:44 AM IST

Updated : Sep 17, 2020, 11:05 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా శుభాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. ట్విట్టర్​ వేదికగా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

"ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు."

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

మోదీ జీవితం స్ఫూర్తిదాయకం...

మరోవైపు భాజపా నేతలు కూడా మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ నాయకత్వంలో భారత దేశం ప్రపంచస్థాయికి ఎదిగిందని ట్వీట్లు చేస్తున్నారు.

"మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంవైపు నడిచి ప్రపంచ స్థాయికి ఎదిగింది. దేశ నిర్మాణానికే మోదీ తన జీవితాన్ని అంకితమిచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఆయనొక స్ఫూర్తి."

--- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

"దేశంలో అత్యంత ప్రాముఖ్యత గల నేతల్లో మోదీ ఒకరు. బలహీన వర్గాలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విధంగా చర్యలు తీసుకున్నారు. దేశ సంక్షేమం కోసం మోదీ తన జీవితం మొత్తాన్ని అర్పించారు. ఇప్పుడు భారత్​ స్వీయ సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నారు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు."

--- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

"మోదీ నాయకత్వంతో దేశం ఎంతో లబ్ధిపొందింది. ఆయన నిబద్ధత దేశాని మేలు చేసింది. పేదల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన ఆహర్నిశలు పనిచేస్తున్నారు. మోదీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా."

--- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణమంత్రి

మరోవైపు మోదీ పుట్టినరోజును కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. 'సేవా దివాస్​' పేరుతో దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఇదీ చూడండి:-మోదీకి సైకత శిల్పంతో శుభాకాంక్షలు

Last Updated : Sep 17, 2020, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details