తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనా గ్రామం నిర్మాణం- కేంద్రంపై కాంగ్రెస్​ ఫైర్​ - అరుణాచల్​లో చైనా అక్రమ నిర్మాణాలు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకపడ్డారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించిందని వస్తున్న వార్తల నేపథ్యంలో జాతీయ భద్రతా సమస్యపై రాహుల్‌ గాంధీ విమర్శించారు.

Rahul Gandhi attacks PM on reports of Chinese village in Arunachal
జాతీయ భద్రతా సమస్యపై కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్​

By

Published : Jan 19, 2021, 12:20 PM IST

మోదీ సర్కార్​పై మరోసారి తీవ్రవిమర్శలు చేశారు కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​గాంధీ. అరుణాచల్‌ ప్రదేశ్‌లో డ్రాగన్‌ దేశం నిర్మిస్తున్న గ్రామానికి సంబంధించిన వార్తా కథనాన్ని జోడిస్తూ రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు.

కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ ట్విట్టర్​లో పోస్ట్​ చేసిన చిత్రం

'మోదీ 56 ఇంచుల చాతి ఎక్కడ ఉందని' కాంగ్రెస్‌ నాయకుడు రణ్​దీప్‌ సూర్జేవాలా ప్రశ్నించారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా 100 ఇళ్లు నిర్మిస్తున్నట్లు గతంలోనే భాజపా ఎంపీ తపిర్‌ గావో లోక్‌సభ దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని కాంగ్రెస్​ సీనియర్ నేత చిదంబరం గుర్తు చేసిన చేశారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తక్షణం సమధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అరుణాచల్​లో చైనా హల్​చల్​..

అరుణాచల్​లో చైనా ఆక్రమించిన భూభాగం

పొరుగు దేశ భూభాగాల ఆక్రమణ పర్వాన్ని చైనా యథేచ్ఛగా కొనసాగిస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏకంగా ఒక గ్రామాన్ని కూడా డ్రాగన్‌ నిర్మించినట్లు తాజాగా వెల్లడైంది. ఈ క్రమంలో 4.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. ఆ గ్రామంలో 101 ఇళ్లు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది భారత్‌కు ఆందోళనకర అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగువ సుభాన్‌సిరి జిల్లాలో సారి చు నది ఒడ్డున ఈ గ్రామం వెలిసింది. ఈ ప్రాంతంపై భారత్, చైనాల మధ్య వివాదం ఉంది. గతంలో ఇక్కడ యుద్ధం కూడా జరిగింది. గత ఏడాది నవంబరు 1న తీసిన ఉపగ్రహ చిత్రంలో ఈ గ్రామం కనిపించింది. 2019 ఆగస్టులో అది లేదు. ఆ ప్రాంతంలో చైనా సైనిక శిబిరానికి కొద్దిదూరంలో ఈ గ్రామం ఉంది. ఆ శిబిరాన్ని కూడా గత దశాబ్ద కాలంలో గణనీయంగా ఆధునికీకరించారు.

తమ దృష్టికి వచ్చింది: భారత్‌

సరిహద్దు ప్రాంతాల్లో చైనా కొన్ని నిర్మాణాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత ప్రభుత్వం పేర్కొంది. తాము కూడా సరిహద్దుల్లో మౌలిక వసతులను మెరుగుపరచుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నట్లు పేర్కొంది. వీటివల్ల స్థానికులకూ ప్రయోజనం చేకూరుతుందని వివరించింది. దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ చేపడుతున్నట్లు పేర్కొంది. సరిహద్దు ప్రాంతంలో భారత్‌ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు సైనిక మోహరింపులనూ పెంచుతోందని గత ఏడాది అక్టోబరులో చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. కొన్ని నెలలుగా సాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలకు ఇదే ప్రధాన కారణమని పేర్కొంది. అయితే తాజా గ్రామానికి చుట్టుపక్కల ఎక్కడా భారత రోడ్లు, ఇతర మౌలిక వసతులు లేకపోవడం గమనార్హం.

అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ తాపిర్‌ గావో కూడా గత ఏడాది నవంబరులో ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు. చైనా తమ రాష్ట్రంలోకి చొరబాట్లు సాగిస్తోందని ఆరోపించారు. డబుల్‌లేన్‌ రోడ్డును నిర్మిస్తోందని తాజాగా ఆయన పేర్కొన్నారు. నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. నది వెంబడి పరిశీలనలు సాగిస్తే 60-70 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు స్పష్టమవుతోందని తెలిపారు. లెన్సి అనే ఒక నది పక్కన రోడ్డును నిర్మిస్తోందని చెప్పారు.

ఇదీ చదవండి :ఉగ్రకుట్ర భగ్నం - ఇద్దరు ముష్కరులు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details