తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కూలీల మరణాలు మోదీ ప్రభుత్వానికి తెలియదా?'

లాక్​డౌన్​లో వలస కూలీల మరణాలపై సమాచారం లేదని కేంద్రం చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల మరణాలు, ఉద్యోగాల కోతలు ప్రపంచమంతా చూశాయని, మోదీ ప్రభుత్వానికే కనిపించలేదా అని ప్రశ్నించారు.

rahul gandhi
రాహుల్ గాంధీ

By

Published : Sep 15, 2020, 10:52 AM IST

మోదీ ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తోన్న కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.. మరోసారి కేంద్రంపై ధ్వజమెత్తారు. లాక్​డౌన్ కాలంలో వలస కూలీల మరణాలు, ఉద్యోగాల కోతలపై ఎలాంటి సమాచారం లేదని పార్లమెంటులో కేంద్ర కార్మిక శాఖ లిఖితపూర్వక వివరణపై మండిపడ్డారు.

రాహుల్ గాంధీ ట్వీట్

"లాక్​డౌన్​లో ఎంతమంది వలస కూలీలు మరణించారు, ఎన్ని ఉద్యోగాలు పోయాయో మోదీ ప్రభుత్వానికి తెలియదు. మీరు లెక్కించలేదా? లేక ఎవరూ చనిపోలేదా? ఇలాంటి విషయాలు ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపలేకపోవటం బాధాకరం. వారి మరణాలను ప్రపంచమంతా చూసింది. ఒక్క మోదీ ప్రభుత్వానికే తెలియలేదు."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. విరామం లేకుండా అక్టోబర్​ 1 వరకు సమావేశాలు కొనసాగుతాయి. కరోనా నేపథ్యంలో ఉభయ సభలు వేర్వేరుగా రోజూ నాలుగు గంటలపాటు సమావేశమవుతాయి. అయితే, రాహుల్ గాంధీ ఈ సమావేశాలకు హాజరు కాలేదు.

ఇదీ చూడండి:పార్లమెంటుకు సోనియా, రాహుల్​ గైర్హాజరు- కారణమిదే

ABOUT THE AUTHOR

...view details