వయనాడ్‌లో రాహుల్ 'కృతజ్ఞతా' పర్యటన సార్వత్రిక ఎన్నికల్లో కేరళ వయనాడ్ నుంచి గెలుపొందిన అనంతరం తొలిసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన సాగుతుంది.
లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు కాంగ్రెస్ అధ్యక్షుడు. అక్కడి ప్రజలు రాహుల్‌ను 4 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వయనాడ్‌లో పర్యటిస్తున్నారు రాహుల్. నియోజకవర్గానికి చెందిన పలు ప్రాంతాల ప్రజలతో కాంగ్రెస్ అధ్యక్షుడు మమేకమవుతారు.
వర్షాన్నీ లెక్క చేయకుండా
శుక్రవారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్ నేతలు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ర్యాలీని వర్షం అడ్డగించింది. కాని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేల సంఖ్యలో అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్ వాహనం ముందు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
వయనాడ్ ఎంపీగా లేఖ
వయనాడ్ ఎంపీగా ఎన్నికైన అనంతరం స్థానిక రైతు ఆత్మహత్యపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఇటీవలే లేఖ రాశారు రాహుల్. ప్రస్తుత పర్యటనలో ఆ రైతు కుటుంబాన్ని రాహుల్ పరామర్శించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: 'మోదీ... మీ సమావేశం దండగ... నేను రాను'