మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేంచుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రపన్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ సర్కారును కూల్చే పనిలో నిమగ్నమై అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 35శాతం తగ్గిన విషయాన్ని ఆయన గుర్తించడం లేదని ట్విట్టర్ వేదికగా విమర్శించారు రాహుల్.
లీటర్ పెట్రోల్ ధర రూ.60లోపు తీసుకురాగలరా? తద్వారా దేశ ప్రజలకు ప్రయోజనం చేకూర్చగలరా? అంటూ ప్రశ్నించారు రాహుల్.
"ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో మీరు తీరిక లేకుండా ఉన్నారు. అందుకే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 35శాతం పడిపోయిన విషయాన్ని గమనించడం లేదు. లీటర్ పెట్రోల్ ధరను రూ.60లోపు ఉండేలా చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చగలరా? మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేలా చేయలేరా? "