కరోనా మహమ్మారి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ అసమర్థత వల్లే దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. అందువల్లే ప్రపంచంలో కరోనా ప్రభావిత దేశాల్లో బ్రెజిల్‌ను వెనక్కి నెట్టి భారత్ రెండోస్థానానికి చేరిందని ట్వీట్ చేశారు.
"కరోనా నియంత్రణలో లోపం వల్ల కొవిడ్ కేసుల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరింది. గత వారాంతంలో అమెరికా, బ్రెజిల్ కంటే దేశంలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో భారత్ వాటా 40 శాతం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి."