తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ... దమ్ముంటే అవినీతిపై చర్చకు రండి' - మోదీ

అవినీతిపై తనతో చర్చకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సవాల్​ చేశారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. తనతో 15 నిమిషాలు చర్చలో పాల్గొంటే నిజాలన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు.

అవినీతిపై చర్చకు రావాలని మోదీకి రాహల్​ సవాల్​

By

Published : Apr 22, 2019, 4:34 PM IST

Updated : Apr 22, 2019, 5:37 PM IST

దేశంలో జరుగుతున్న అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో చర్చకు రావాలని సవాల్​ చేశారు రాహుల్​ గాంధీ. 15 నిమిషాలు చర్చలో పాల్గొంటే నీళ్లకు నీళ్లు, పాలకు పాలు వేరవుతాయన్నారు. నిజానిజాలు తేలితే.. మోదీ దేశానికి ముఖం చూపించుకోలేరని వ్యాఖ్యానించారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని రాయ్​బరేలీ ప్రచార కార్యక్రమలో పాల్గొన్న రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

'మోదీ... దమ్ముంటే అవినీతిపై చర్చకు రండి'

" నరేంద్ర మోదీకి నేను సవాల్​ చేస్తున్నా. అవినీతిపై నేను 15 నిమిషాలు చర్చిస్తాను. అవినీతిపై బహిరంగ చర్చలో ఒక వైపు నేను.. మరో వైపు నరేంద్ర మోదీ చర్చిద్దాం. 15 నిమిషాలు చర్చించిన అనంతరం నరేంద్ర మోదీ దేశానికి తన మూఖాన్ని చూపించలేరు. నీళ్లకు నీళ్లు, పాలకు పాలు వేరవుతాయి. నరేంద్ర మోదీ రండి.. సవాల్​ను స్వీకరించండి. అవినీతిపై మాట్లాడండి. మోదీ భయాన్ని వీడండి." - రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

Last Updated : Apr 22, 2019, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details