ఉత్తరప్రదేశ్ అమేఠీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నామపత్రం దాఖలు చేశారు. ఏఐసీసీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా హాజరయ్యారు. తొలుత మున్షిగంజ్-దర్పిపుర్ నుంచి గౌరిగంజ్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు అమేఠీ జిల్లా పరిపాలనా కార్యాలయానికి చేరుకున్నారు.
అమేఠీ లోక్సభ స్థానానికి 15 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాహుల్. 2014లో భాజపా నేత స్మృతి ఇరానీపై లక్ష ఓట్ల మెజారిటీతో రాహుల్ గెలుపొందారు. ఈ సారీ అమేఠీ బరిలో నిలుస్తున్నారు ఇరానీ.