తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ వంశానికి కమిటీల కన్నా కమీషన్లే ప్రధానం' - రాహుల్​పై భాజపా విమర్శలు

రక్షణ రంగంపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నిర్వహించిన ఒక్క సమావేశానికైనా హాజరుకాని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. సైన్యాన్ని నిరుత్సాహపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ట్విట్టర్​ వేదికగా విమర్శించారు నడ్డా. రాహుల్​... రక్షణరంగ కమిటీల కన్నా కమీషన్లకే ప్రాధాన్యం ఇచ్చిన వంశానికి చెందిన వారని ఎద్దేవా చేశారు.

Rahul does not attend Parl committee meetings on defence but 'demoralises' armed forces: Nadda
'సైన్యాన్ని నిరుత్సాహపర్చడం ప్రతిపక్ష నేతకు తగదు'

By

Published : Jul 6, 2020, 12:41 PM IST

కాంగ్రెస్​ నేత రాహుల్​పై తీవ్ర విమర్శలు చేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రక్షణ రంగంపై పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ నిర్వహించిన ఒక్క సమావేశానికి కూడా హాజరుకాని రాహుల్... సైన్యాన్ని నిరుత్సాహపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

జేపీ నడ్డా ట్వీట్

దేశ సైన్యాన్ని నిరుత్సాహపర్చడం, సైనిక బలగాల పరాక్రమాన్ని శంకించడం ఓ బాధ్యత గల విపక్ష నేతకు తగదని నడ్డా హితవు పలికారు. రాహుల్‌ గాంధీ... రక్షణరంగ కమిటీల కన్నా కమీషన్లకే ప్రాధాన్యం ఇచ్చిన వంశానికి చెందిన వారని ఎద్దేవా చేశారు. పార్లమెంటరీ వ్యవహారాలను అర్థం చేసుకోగల నాయకులు కాంగ్రెస్‌ పార్టీలోనూ ఉన్నారన్న నడ్డా... వారిని ఓ వంశం ఎదగనీయకపోవడం బాధాకరమన్నారు.

జేపీ నడ్డా ట్వీట్

ఇదీ చూడండి:'కేంద్రం వైఫల్యం హార్వర్డ్ కేస్ స్టడీగా మారుతుంది'

ABOUT THE AUTHOR

...view details