కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. విచారణకు హాజరు కానక్కర్లేదంటూ సుప్రీంకోర్టు తాజా తాఖీదుల్లో పేర్కొంది.
ఈ పిటిషన్పై ఏప్రిల్ 30న విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
నినాదాన్ని కొనసాగిస్తాం: కాంగ్రెస్
'చౌకీదార్ చోర్ హై' వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఉద్దేశపూర్వకంగా ఆపాదించలేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. అయితే నినాదాన్ని భవిష్యత్తులోనూ ప్రచారంలో వాడతామని స్పష్టం చేసింది.
రఫేల్పై తీర్పులో 'చౌకీదార్ చోర్ హై' అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని రాహుల్ పేర్కొన్నారు. ఈ విషయమై సుప్రీం తీర్పును వక్రీకరించి ధిక్కరణకు పాల్పడ్డారని భాజపా నేత మీనాక్షి లేఖి ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి:రాహుల్ 'దేశద్రోహం' కేసుపై 26న విచారణ