తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రఫేల్​పై చర్చకు మోదీ సిద్ధమేనా : రాహుల్​

ప్రధాని నరేంద్రమోదీపై విమర్శల దాడిని తీవ్రం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అవినీతి, రఫేల్​పై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని మోదీకి సవాల్​ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్​, బంగాల్​లో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు రాహుల్.

రాహుల్ గాంధీ

By

Published : Apr 10, 2019, 10:30 PM IST

ప్రధాని నరేంద్రమోదీపై విమర్శల జోరు పెంచారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్​ కటిహార్​, బంగాల్​ రాయ్​గంజ్​లో పర్యటించారు రాహుల్. అవినీతి, రఫేల్​పై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని మోదీకి సవాల్​ విసిరారు రాహుల్.

బిహార్​ సభలో రాహుల్ గాంధీ

"

అవినీతిపై నరేంద్రమోదీని మీ ముందునాతో చర్చించమనండి. రఫేల్​పై మాట్లాడేందుకు 15 నిమిషాలు కేటాయించమనండి. మీకు ముఖం చూపించడానికి కూడా ఆయన ఇబ్బంది పడేలా చేస్తా. మీరు అనిల్​ అంబానీకి 30వేల కోట్లు ఎందుకు ఇచ్చారు? మీరు ఫ్రాన్స్​కు అనిల్​ అంబానీతో కలిసి వెళ్లారా లేదా? ఫ్రాన్స్​ అధ్యక్షుడు కూడా చెప్పారు... రఫేల్​ ఒప్పందం హెచ్​ఏఎల్​కు కాకుండా అనిల్​ అంబానీకే ఇవ్వాలన్నది మోదీ నిర్ణయమేనని. "

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

ధనికులకే మోదీ రుణమాఫీ

దేశాన్ని పేద, ధనిక వర్గాలుగా మోదీ విడగొట్టారని రాహుల్ ఆరోపించారు. దేశంలోని అత్యంత ధనికులకే మోదీ రుణమాఫీ చేశారని విమర్శించారు కాంగ్రెస్ అధ్యక్షుడు.

"నరేంద్ర మోదీ తన మిత్రులు నీరవ్​ మోదీ, అనిల్​ అంబానీలను ఒకవైపు, పేదరైతులను మరోవైపుగా విభజించారు. దేశంలోని అత్యంత ధనికుల చేతికి బ్యాంకుల తాళాలిచ్చారు. అధికారంలోకి వచ్చాక మళ్లీ వాటిని ప్రజల చేతికిస్తాం. రఫేల్​కు భయపడే మోదీ వాగ్ధాటి తగ్గింది."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

ఇదీ చూడండి: 'పారికర్​ లేని లోటు కనిపిస్తోంది'

ABOUT THE AUTHOR

...view details