కశ్మీర్ సందర్శనకు ఐరోపా సమాఖ్య ప్రతినిధుల బృందాన్ని అనుమతించడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టింది భాజపా. ప్రస్తుతం కశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్లవచ్చని భాజపా అధికార ప్రతినిధి షా నవాజ్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. తాము ఎవరినీ అడ్డుకోవట్లేదన్నారు.
"కశ్మీర్లో సాధారణ పరిస్థితులు వచ్చాక అక్కడికి వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను ఎవరు అడ్డుకున్నారు? రాహుల్ గాంధీ అయినా వెళ్లొచ్చు. వేరే ఎవరైనా సందర్శించవచ్చు. విమానంలో చేరుకోవచ్చు. ఈయూ ఎంపీలు వెళ్లడం మంచి పరిణామం. దాచిపెట్టాల్సింది ఏమీ లేదు."