తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదంపై భాజపా ప్రభుత్వం రాజీ: రాహుల్

ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించడంలో మోదీ సర్కార్​ రాజీ పడుతోందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. గతంలో భాజపా ప్రభుత్వమే అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్​ను పాకిస్థాన్​కు అప్పగించిందని ఆరోపించారు.

By

Published : May 4, 2019, 11:48 AM IST

ఉగ్రవాదంపై భాజపా ప్రభుత్వం రాజీ: రాహుల్

భాజపాపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. గత ఎన్డీఏ పాలనలోనే అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్​ను భారత్​ పాకిస్థాన్​కు అప్పగించిందని దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా ఆరోపించారు. ఈ మధ్యకాలంలో విపక్షాల విమర్శలకు భయపడుతోన్న ప్రధానిని చూస్తున్నామని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఉగ్రవాదినీ వెనక్కి పంపలేదని ఉద్ఘాటించారు.

"మసూద్ అజార్ ఉగ్రవాది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అజార్​ను ఎవరు పాకిస్థాన్​కు పంపారు. ఎలా పాక్​కు వెళ్లాడు. ఆయనను కాంగ్రెస్ వెనక్కి పంపిందా? ఏ ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలు జరిపింది? ఏ ప్రభుత్వం వారి ముందు తలలు వంచింది? వాస్తవేమిటంటే భాజపా ప్రభుత్వం ఉగ్రవాదంతో రాజీ పడుతోంది. కాంగ్రెస్ ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదు. చేయదు కూడా. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలి. కాంగ్రెస్ ఉగ్రవాదం విషయంలో మోదీ కంటే కఠినంగా ఉంటుంది. వ్యూహాత్మకంగా ముందుకు వెళతాం. ఇంకా అనేక విషయాలు దేశంలో ఉన్నాయి. నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయం చిన్నాభిన్నం కావడం వీటన్నింటిపై చర్చ జరగాలి."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

ఉగ్రవాదంపై భాజపా ప్రభుత్వం రాజీ: రాహుల్

ఇదీ చూడండి: వేసవి విహారానికి ఏ దేశం ఉత్తమమో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details