తెలంగాణ

telangana

By

Published : Oct 9, 2020, 5:53 AM IST

ETV Bharat / bharat

'విమానాలు తప్ప సైనికులను మోదీ పట్టించుకోరు'

కేంద్రంపై మరోసారి విమర్శల దాడి చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ప్రభుత్వం ఇటీవలే కొనుగోలు చేసిన వీవీఐపీ విమానాలపై ఆరోపణలు చేశారు రాహుల్​. ఆ విమానాలకు అయ్యే ఖర్చుతో సరిహద్దుల్లోని సైనికులకు అనేక వస్తువులను కొనవచ్చని.. వాటి లెక్కలను వివరించారు.

Rahul attacks PM over VVIP aircraft acquisition
'మోదీ తన గురించి ఆలోచిస్తారే తప్ప సైనికులను పట్టించుకోరు'

కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేసిన వీవీఐపీ బోయింగ్​ విమానాల కొనుగోలుపై మండిపడ్డారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ఈ విమానాలకు అయ్యే ఖర్చుతో సియాచిన్​- లద్దాఖ్​ సరిహద్దులో ఉన్న సైనికులకు అనేక వస్తువులు కొనుగోలు చేయవచ్చని విమర్శల దాడి చేశారు రాహుల్​.

విమానాల కొనుగోలు పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ.. వేల కోట్ల రూపాయలను వృథా చేస్తున్నారని ట్విట్టర్​ వేదికగా ఆరోపించారు రాహుల్​. ఈ సొమ్ముతో సైనికులకు పలు వస్తువులను కొనవచ్చని పేర్కొంటూ.. సంబంధిత లెక్కల్ని ట్వీట్​ చేశారు.

రాహుల్​ గాంధీ ట్వీట్​

"మోదీ తన కోసం రూ.8,400 కోట్ల విలువైన విమానం కొనుకున్నారు. ఈ సొమ్ముతో సియాచిన్​-లద్దాఖ్​ సరిహద్దులోని సైనికులకు ఎన్నో వస్తువులు సమకూర్చవచ్చు. అందులో వెచ్చటి దుస్తులు- రూ.30,00,000; జాకెట్​, గ్లవ్స్​- రూ.60,00,000; బూట్లు- రూ.67,20,000; ఆక్సిజన్​ సిలిండర్​- రూ.16,80,000 వంటి వాటిని కొనుగోలు చేయవచ్చు."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధినేత.

ప్రధాని ఎల్లప్పుడూ తన గురించి మాత్రమే ఆలోచిస్తారని.. సైనికులను ఏమాత్రం పట్టించుకోరని విమర్శించారు రాహుల్​.

ఇదీ చదవండి:'మోదీ హయాంలో రూ.12వేల కోట్ల ఇనుప కుంభకోణం'

ABOUT THE AUTHOR

...view details