భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటినా ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న వేళ.. ప్రజల ముందుకు రాకుండా కనబడకుండాపోయిందన్నారు.
'ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండి.. ఇదే స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూపోతే.. ఆగస్ట్ నెలలోగా కేసుల సంఖ్య 20 లక్షలు దాటిపోతుంది' అంటూ జులై 17న తాను చేసిన ట్వీట్‌ను రాహుల్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.