తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ర్యాంకింగుల కోసం ప్రజాధనం ఖర్చు చేస్తారా?'

అంతర్జాతీయ హంగుల కోసం ప్రజాధనాన్ని కేంద్రం ఖర్చు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓవైపు ఆర్థిక వ్యవస్థ పతనం, నిరుద్యోగం వేధిస్తుంటే అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.

RAHUL-GOVT
రాహుల్ గాంధీ

By

Published : Aug 22, 2020, 4:56 AM IST

దేశంలోని సమస్యలను ఉటంకిస్తూ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం ప్రబలుతుంటే అంతర్జాతీయ హంగుల కోసం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలని చూస్తున్నట్లు మండిపడ్డారు.

ఓ వార్తా కథనం ఆధారంగా మోదీ ప్రభుత్వంపై ఈ విధంగా స్పందించారు రాహుల్.

రాహుల్ గాంధీ ట్వీట్

"ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, చైనా ఆక్రమణలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రపంచ ర్యాంకింగ్ సూచీల్లో మెరుగుపడేందుకు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలని చూస్తోంది."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ కల్పనపై మెరుగుదల కోసం ఎలాంటి నిర్ణయాలకు సంబంధించి వెల్లడించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

ఇదీ చూడండి:వేర్వేరు రోజుల్లో పార్లమెంటు ఉభయసభల సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details