గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఎదుట హాజరయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్. వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్ మోదీ, నీరవ్ మోదీలను ప్రస్తావించి ప్రధాని నరేంద్ర మోదీకి ముడిపెట్టారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సూరత్ కోర్టులో రాహుల్‌పై పరువు నష్టం దావా దాఖలు చేశారు గుజరాత్ భాజపా శాసనసభ్యుడు పూర్ణేష్ మోదీ.
'మోదీ' వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు ముందుకు రాహుల్ - rahul gandhi appears surat court
పరువు నష్టం దావా కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టులో హాజరయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మోదీ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌పై కేసు నమోదు చేశారు గుజరాత్ భాజపా శాసనసభ్యుడు పూర్ణేష్ మోదీ.
'మోదీ' వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు ముందుకు రాహుల్
విచారణ సందర్భంగా తాను ఏ తప్పూ చేయలేదని న్యాయస్థానానికి తెలిపారు రాహుల్. రాహుల్ న్యాయస్థానంలో వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేకుండా శాశ్వత వెసులుబాటు కల్పించాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు. ఈ అభ్యర్థనపై నిర్ణయాన్ని తదుపరి విచారణ జరిగే డిసెంబర్ 10న తెలియజేస్తామని కోర్టు చెప్పింది. ఆ రోజు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రాహుల్‌కు మినహాయింపు ఇచ్చింది న్యాయస్థానం.
ఇదీ చూడండి: 17 ఏళ్ల బాలికను సజీవదహనం చేసిన ప్రేమోన్మాది