తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ పరువు నష్టం' కేసులో రాహుల్​కు బెయిల్​ - పరువునష్టం కేసులో రాహుల్​గాంధీకి బెయిల్​

బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్​కుమార్​ మోదీ వేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీకి ఊరట లభించింది. ఆయనకు పట్నా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు స్వయంగా హాజరైన రాహుల్​.. భాజపా-ఆర్​ఎస్​ఎస్​ వారికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

పరువునష్టం కేసులో రాహుల్​గాంధీకి బెయిల్​

By

Published : Jul 6, 2019, 3:38 PM IST

పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీకి ఊరట కలిగింది. బిహార్​ ఉపముఖ్యమంత్రి సుశీల్​కుమార్​ వేసిన పరువునష్టం కేసును విచారించిన పట్నా కోర్టు రాహుల్​కు బెయిల్ మంజూరు చేసింది.

కోర్టు విచారణకు స్వయంగా హాజరైన రాహుల్ గాంధీ... భాజపాపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిపై ఆ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

"దేశంలోని పేదలు, రైతుల, కార్మికుల పక్షాన పోరాడటానికి నేను కట్టుబడి ఉన్నాను. వారికి సంఘీభావం తెలపడానికి నేను ఇక్కడికి వచ్చాను.మోదీ ప్రభుత్వానికి, ఆర్​ఎస్​ఎస్-భాజపాకు వ్యతిరేకంగా గళమెత్తిన వారిని లక్ష్యంగా చేసుకుని కోర్టు కేసుల్లో ఇరికిస్తున్నారు. అయినా నా పోరాటం మాత్రం ఆగదు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్​ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ విమర్శలపై అభ్యంతరం చెబుతూ బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్​కుమార్ మోదీ పట్నా కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు.

ఇదీ చూడండి: సోమవారమే కుమారస్వామి సర్కార్​ పతనం!

ABOUT THE AUTHOR

...view details