దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులకు వివిధ పార్టీల నాయకులు అండగా నిలుస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల్ని 'అంబానీ-అదానీ చట్టాలు'గా అభివర్ణించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు మించి ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను ముందుకు తెచ్చినా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
కేజ్రీవాల్ మద్దతు
మరోవైపు రైతుల డిమాండ్లకు తాము పూర్తిగా మద్దతిస్తున్నామని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అన్నదాతలు ఆందోళన చేపట్టిన తొలిరోజు నుంచి తమ ఆమ్ ఆద్మీ పార్టీ వారికి అండగా నిలబడిందన్నారు. రైతుల పిలుపు మేరకు డిసెంబరు 8న జరగనున్న భారత్ బంద్‌కు ఆప్ సంపూర్ణ మద్దతునిస్తోందని పునరుద్ఘాటించారు.