జమ్ముకశ్మీర్‌లో పర్యటించాలన్న ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆహ్వానాన్ని రాహుల్ గాంధీ స్వీకరించారు. విపక్ష బృందంతో కలిసి కశ్మీర్లో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ట్వీట్ చేశారు.
"జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో పర్యటించాలన్న మీ ఆహ్వానాన్ని విపక్ష బృందంతో కలిసి నేను స్వీకరిస్తున్నా. మాకు విమానం అవసరం లేదు. కానీ రాష్ట్రంలో పర్యటించి అక్కడి ప్రజలు, సైనికులు, ముఖ్య నేతలను కలిసే స్వేచ్ఛను ఇవ్వండి."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.