తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ నేత రఘువంశ్​కు తీవ్ర అస్వస్థత - Raghuvansh Prasad Singh's condition worsens, put on ventilator

బిహార్​ ఆర్జేడీ మాజీ నేత రఘువంశ్​ ప్రసాద్​ సింగ్​ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలే కరోనాతో దిల్లీ ఎయిమ్స్​లో చేరారు రఘువంశ్​. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఆరోగ్యం క్షీణించిందని సన్నిహితులు తెలిపారు.

Raghuvansh Prasad Singh s condition worsens, put on ventilator
బిహార్​ రాజకీయ నేత రఘువంశ్​కు తీవ్ర అస్వస్థత

By

Published : Sep 12, 2020, 5:10 PM IST

బిహార్​- రాష్ట్రీయ జనతాదళ్​(ఆర్జేడీ)తో సుదీర్ఘకాలంగా ఉన్న బంధాన్ని తెంచుకుని రెండు రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్​ నేత రఘువంశ్​ ప్రసాద్​ సింగ్​ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరోనాతో వారం రోజుల క్రితం దిల్లీ ఎయిమ్స్​లో చేరిన రఘువంశ్​ పరిస్థితి గత అర్ధరాత్రి హఠాత్తుగా క్షీణించింది. దీంతో వెంటనే ఆయనకు వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నారు.

అక్కడి నుంచే రాజీనామా లేఖ

ఈ నెల 10న ఆసుపత్రి నుంచే తన రాజీనామా లేఖను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​కు పంపారు రఘువంశ్​. లాలూకు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందిన రఘువంశ్.. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రూపొందించడంలో రఘువంశ్​ను కీలకంగా చెబుతుంటారు.

ఇదీ చదవండి:అపార జ్ఞాపకశక్తి.. ఈ చిచ్చరపిడుగు సొంతం

ABOUT THE AUTHOR

...view details