తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రఫేల్' వాయుసేనలోకి చేరే కీలక ఘట్టం నేడే - రఫేల్​ జెట్ల పూర్తి వివరాలు

నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత ఇటీవల భారత్​కు చేరిన తొలి 5 రఫేల్ జెట్లను గురువారం.. వైమానిక దళానికి అప్పగించనుంది రక్షణ శాఖ. అంబాలా ఎయిర్​బేస్​లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్​ పార్లీ సహా ఆర్మీ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

Rafale jets inducted into IAF Today
నేడు వాయుసేనలో చేరనున్న రఫేల్ జెట్లు

By

Published : Sep 10, 2020, 4:56 AM IST

Updated : Sep 10, 2020, 8:02 AM IST

భారత రక్షణ రంగం బలాన్ని పెంచే రఫేల్ యుద్ధ విమానాల తొలి బ్యాచ్.. వైమానిక దళం(ఐఏఎఫ్​)లో అధికారికంగా చేరేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే భారత్ చేరుకున్న ఐదు రఫేల్ జెట్లను గురువారం లాంఛనంగా వైమానిక దళానికి అప్పగించనుంది రక్షణ శాఖ. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నవేళ రఫేల్ యుద్ధ విమానాలు వైమానిక దళంలో చేరుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

వాయుసేనకు రఫేల్ యుద్ధ విమానాలు అప్పగించేందుకు అంబాలా ఎయిర్​బేస్​లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది రక్షణ శాఖ. దీనికి భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, వాయుసేన సారథి రాకేశ్​ కుమార్​ సింగ్​ భదౌరియా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్​లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

రఫేల్​కు పూజలు...

సంప్రదాయ పద్ధతిలో రఫేల్ విమానాలకు 'సర్వ ధర్మ పూజ' చేయనున్నారు. ఆ తర్వాత రఫేల్​తో పాటు తేజస్ జెట్లు వాయు విన్యాసాలు ప్రదర్శించనున్నాయి.

రఫేల్ జెట్లను వైమానిక దళంలోకి పంపే ముందు.. వాటర్ కెనాన్ సెల్యూట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఐఏఎఫ్ వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది తెలిపారు.

మరో 36 జెట్ల కొనుగోలుకు చర్చలు?

వాయుసేనకు రఫేల్ జెట్ల అప్పగింత పూర్తైన తర్వాత రాజ్​నాథ్, పార్లీ మధ్య భారత్-ఫ్రాన్స్​ పరస్పర ద్వైపాక్షిక రక్షణ సహకార బలోపేతంపై కీలక చర్చలు జరగనున్నాయి. మరో 36 రఫేల్ జెట్ల కొనుగోలు అంశం కూడా వీరి భేటీలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:రఫేల్​ ఎంట్రీకి ముందు ఫ్రాన్స్​ కీలక వ్యాఖ్యలు

Last Updated : Sep 10, 2020, 8:02 AM IST

ABOUT THE AUTHOR

...view details