తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపు వైమానిక దళంలోకి చేరనున్న రఫేల్ జెట్లు - రఫేల్ ఒప్పందం పూర్తి వివరాలు

జులైలో భారత్​కు వచ్చిన ఐదు రఫేల్ యుద్ధ విమానాలు.. గురువారం భారత వైమానిక దళంలో అధికారికంగా చేరనున్నాయి. హరియానాలోని అంబాలా ఎయిర్​బేస్​లో జరిగే ఈ కార్యక్రమానికి భారత్, ఫ్రాన్స్ రక్షణ మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

Rafale fighter jets into Indian Air force
ఎయిర్​ఫోర్స్​లోకి రఫేల్ యుద్ధ విమానాల చేరిక

By

Published : Sep 9, 2020, 5:13 AM IST

Updated : Sep 9, 2020, 5:40 AM IST

రఫేల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళం(ఐఏఎఫ్​)లోకి గురువారం లాంఛనంగా చేరనున్నాయి. హరియానాలోని అంబాలా ఎయిర్​బేస్​లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది రక్షణ శాఖ.

భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, ఉన్నత స్థాయి ఆర్మీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం గురువారం ఉదయమే భారత్ చేరుకోనున్నారు పార్లీ.

ఈ కార్యక్రమం అనంతరం ఇరు దేశాల మధ్య పరస్పర రక్షణ సహకారాలను మరింత బలపరుచుకునే అంశంపై రాజ్​నాథ్, పార్లీ కీలక చర్చలు జరపనున్నారు.

తొలి దశలో ఐదు విమానాలు..

మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భాగంగా తొలి దశలో ఐదు జెట్లు జులై 29న అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 10 జెట్లను భారత్​కు అప్పగించగా అందులో ఐదు.. ఐఏఎఫ్​ పైలట్లకు శిక్షణ కోసం ఫ్రాన్స్​లోనే ఉంచారు.

ఒప్పందం ఇలా..

36 రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రూ. 59వేల కోట్లతో 2016లో ఫ్రాన్స్​తో ఒప్పందం చేసుకుంది భారత్​. 36 రఫేల్ జెట్స్​లో 30 యుద్ధ విమానాలు, ఆరు శిక్షణ కోసం వినియోగించేవి ఉన్నాయి. వీటన్నింటిని ఫ్రాన్స్​కు చెందిన డసో ఏవియేషన్​ రూపొందిస్తోంది.

రఫేల్ జెట్స్​ తొలి స్వ్కాడ్రన్​ను అంబాలా వైమానిక స్థావరంలో, రెండో స్వ్కాడ్రన్​ను బంగాల్​లోని హసిమారా స్థావరంలో ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చూడండి:ఓ వైపు ప్రతిష్టంభన.. మరోవైపు సంప్రదింపులు!

Last Updated : Sep 9, 2020, 5:40 AM IST

ABOUT THE AUTHOR

...view details