భారత వైమానిక దళంలో ఇటీవల చేరిన రఫేల్ యుద్ధ విమానాలు గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొన్నాయి. వర్టికల్ చార్లీ పద్ధతిలో ప్రయాణం చేస్తూ ప్రేక్షకులకు కనువిందు చేశాయి.
గంటకు 900కి.మీ వేగంతో 'రఫేల్' గర్జన - రఫెల్
రఫేల్ యుద్ధ విమానాలు గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొన్నాయి. వర్టికల్ చార్లీ పద్ధతిలో విన్యాసాలు చేశాయి. చివరగా ఓ విమానం గంటకు 900కి.మీ వేగంతో ప్రయాణించి ప్రేక్షకులను అబ్బురపరిచింది.

గంటకు 900కి.మీ వేగంతో 'రఫేల్' గర్జన
గణతంత్ర పరేడ్లో కనువిందు చేసిన రఫెల్
రెండు జాగ్వార్, రెండు మిగ్-29, ఒక రఫేల్ విమానం కలిసి గంటకు 780కి.మీల వేగంతో 300మీటర్ల ఎత్తులో ఏకలవ్య పద్ధతిలో ప్రయాణించాయి. చివరగా ఒకే ఒక్క రఫేల్ విమానం ఆకాశంలో గంటకు 900 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. ఈ విన్యాసంతో పరేడ్ ముగిసింది.
ఇదీ చదవండి:గణతంత్ర కవాతులో 'బంగ్లా' సైనికులు
Last Updated : Jan 26, 2021, 1:59 PM IST