తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"రఫేల్​ దస్త్రాలు మాయం కాలేదు" - విమానం

రఫేల్ పత్రాలు రక్షణశాఖ నుంచి మాయం కాలేదని అటార్నీ జనరల్ కేకే. వేణుగోపాల్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో పిటిషనర్లు సమర్పించినవి అసలు పత్రాలకు ప్రతులు (జెరాక్స్​ కాపీలు)మాత్రమేనని వెల్లడించారు.

RAFEL

By

Published : Mar 8, 2019, 8:48 PM IST

రఫేల్​ పత్రాల మాయం దేశంలో ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యంత సురక్షితంగా ఉండాల్సిన రక్షణ ఒప్పంద పత్రాలు మాయమవడంపై విపక్షాలు దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా అటార్నీ జనరల్​ కేకే. వేణుగోపాల్​ రఫేల్​ పత్రాలు మాయం కాలేదని పేర్కొన్నారు.

"రఫేల్​ పత్రాలు మాయమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటిలో ఎంత మాత్రం నిజం లేదు." - కేకే. వేణుగోపాల్, అటార్నీ జనరల్

రఫేల్​ తీర్పుపై పునర్విచారణ కోరుతూ యశ్వంత్​ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్​ భూషణ్​ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఆ పిటిషన్​లో వారు కోర్టుకు సమర్పించిన మూడు పత్రాలు ఒరిజనల్​ కాపీలకు ప్రతులు మాత్రమేనని వేణుగోపాల్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details