తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రఫేల్'​పై భాజపా- కాంగ్రెస్​ మధ్య మాటలతూటాలు - rahul JPC must investigate on rafale deal

'రఫేల్​'పై దాఖలైన సమీక్ష పిటిషన్లు అన్నింటినీ సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. అయితే రఫేల్​ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చేయాలని రాహుల్​గాంధీ అభిప్రాయపడ్డారు.

'రఫేల్'​పై భాజపా- కాంగ్రెస్​ మధ్య మాటలతూటాలు

By

Published : Nov 14, 2019, 6:54 PM IST

Updated : Nov 14, 2019, 8:39 PM IST

'రఫేల్'​పై భాజపా- కాంగ్రెస్​ మధ్య మాటలతూటాలు

'రఫేల్​'పై దాఖలైన సమీక్ష పిటిషన్లు అన్నింటినీ సుప్రీంకోర్టు తిరస్కరించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్​షా హర్షం వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వంపై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్... దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రఫేల్​పై కాంగ్రెస్ విమర్శలకు సుప్రీంతీర్పే సమాధానం
రఫేల్​పై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి

"రఫేల్​పై సమీక్ష పిటిషన్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం.. నిరాధారమైన, తప్పుడు ప్రచారాలపై ఆధారపడే నాయకులకు, పార్టీలకు తగిన గుణపాఠం." - అమిత్​షా, కేంద్ర హోంమంత్రి

రఫేల్​ ఒప్పందం విషయంలో మోదీ ప్రభుత్వం ఎలాంటి అవినీతికి, కుంభకోణాలకు పాల్పడలేదని.. ఇదే విషయాన్ని సుప్రీం తీర్పు స్పష్టం చేసిందని అమిత్​షా పేర్కొన్నారు. రఫేల్​ అంశంపై కాంగ్రెస్ విలువైన పార్లమెంట్ సమయాన్ని వృథా చేసిందని ఆరోపించారు.

'రఫేల్​'పై దర్యాప్తు జరగాల్సిందే: రాహుల్​

రఫేల్ ఒప్పందంపై దర్యాప్తు జరగాల్సిందే

రఫేల్ ఒప్పందం​పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిందే అని కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ పునరుద్ఘాటించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎమ్​ జోషి 'రఫేల్​'పై దర్యాప్తునకు పూర్తిస్థాయిలో అవకాశం కల్పించారని ఆయన పేర్కొన్నారు.

రఫేల్​ ఒప్పందంలో జరిగిన అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తు చేపట్టాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.

భాజపాకు క్లీన్​చిట్

ఫ్రాన్స్​కు చెందిన డసో సంస్థ నుంచి 36 రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో మోదీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అంటూ కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ కేసు సమీక్ష పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం ద్వారా మోదీ సర్కారుకు ఊరట లభించింది.

ఇదీ చూడండి:శబరిమలపై సుప్రీం నిర్ణయానికి 'కేరళ స్వాగతం'

Last Updated : Nov 14, 2019, 8:39 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details