తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రఫేల్​ కేసు వాయిదాకు కేంద్రం అభ్యర్థన - మీనాక్షి లేఖి

రఫేల్​ తీర్పు సమీక్షా వ్యాజ్యాలపై విచారణ వాయిదా వేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది కేంద్రం. కొత్త ప్రమాణపత్రం సమర్పించేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరింది. మరోవైపు కోర్టు ధిక్కరణ కేసులో వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ సుప్రీంకు ప్రమాణపత్రాన్ని సమర్పించారు రాహుల్ గాంధీ.

రాహుల్​-రఫేల్

By

Published : Apr 29, 2019, 1:01 PM IST

రఫేల్​పై​ తీర్పు సమీక్షను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టును కేంద్రం అభ్యర్థించింది. రఫేల్​ వివరాలపై కొత్త ప్రమాణ పత్రం సమర్పించేందుకు మరింత సమయం కావాలని కోరింది. వాయిదా అభ్యర్థన లేఖల్ని కక్షిదారులు అందరికీ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.

రఫేల్​ తీర్పుపై సమీక్షకు మొదట కొన్ని అభ్యంతరాలను వెలిబుచ్చింది కేంద్రం. దేశ భద్రతకు సంబంధించిన రహస్య పత్రాల ఆధారంగా రఫేల్​ ఒప్పందంపై పునఃసమీక్ష చేయలేమని వాదించింది. అయితే కేంద్రం అభ్యంతరాలను ఏప్రిల్​ 10న సుప్రీం కొట్టివేసింది.

రఫేల్​ తీర్పు సమీక్షా వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరగాల్సి ఉంది.

కోర్టులో రాహుల్ ప్రమాణ పత్రం దాఖలు

కోర్టు ధిక్కరణ కేసులో ప్రమాణ పత్రాన్ని సమర్పించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. 'చౌకీదార్​ చోర్​ హై' వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

రాహుల్​ కోర్టు ధిక్కరణ కేసుపైనా మంగళవారం విచారణ జరగాల్సి ఉంది.

ఇదీ చూడండి: మోదీ, అమిత్​షాపై సుప్రీంలో పిటిషన్​

ABOUT THE AUTHOR

...view details