రోడ్డు భద్రతపై ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొస్తున్నా కొంతమందిలో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. భారీ జరిమానాలతో కొరడా ఝళిపిస్తున్నా ట్రాఫిక్ ఉల్లం'ఘను'ల తీరు మారడంలేదు. ఇందుకు నిదర్శనం.. ఉత్తరప్రదేశ్ మేరఠ్‌లో జరిగిన తాజా సంఘటన.
మేరఠ్‌లోని ఓ రహదారిపై దున్నపోతు లాగే బండి, మోటారుసైకిళ్లకు మధ్య రేసు పెట్టారు కొందరు ఆకతాయిలు. వేగంగా వెళ్లాలని ఆ పశువును హింసించగా.. తప్పించుకునేందుకు ప్రయత్నించింది ఆ దున్నపోతు. ఈ ప్రయత్నంలో బండి డివైడర్‌ను ఢీకొట్టింది. దానిపై ప్రయాణిస్తున్న యువకులు 2 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.