తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గణతంత్ర​ పరేడ్​'పై 22 ఎఫ్​ఐఆర్​లు.. భద్రత కట్టుదిట్టం - రైతుల ఆందోళన బుధవారం

దిల్లీ సరిహద్దులో మంగళవారం రైతులు నిర్వహించిన గణతంత్ర పరేడ్​లో హింసాత్మక ఘటనలపై పోలీసులు 22 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు. 300 మంది పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.

Delhi Police registers 22 FIRs
153 మంది పోలీసులకు గాయాలు- 22 ఎఫ్ఐఆర్​లు

By

Published : Jan 27, 2021, 10:35 AM IST

Updated : Jan 27, 2021, 10:49 AM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం నిర్వహించిన గణతంత్ర పరేడ్​లో హింసాత్మక ఘటనలపై ఇప్పటివరకు 22 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. 300 మంది సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వారిలో ఇద్దరు ఐసీయూలో ఉన్నట్లు చెప్పారు. మంగళవారం జరిగిన హింసాత్మక ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

భద్రత కట్టుదిట్టం..

హింసాత్మక ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​)​ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే.. ఈ అంశంపై​ విచారణ ప్రారంభించిన అధికారులు.. పంజాబ్, హరియాణా గ్యాంగ్‌స్టర్ల కదలికలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నాటి ఉద్రిక్తతల నేపథ్యంలో.. దిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. దేశ రాజధానిలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసుల గస్తీ పెంచగా పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో రైతుల చర్యల ఫలితంగా.. అక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించారు.

ఎర్రకోట వద్ద పోలీసుల బందోబస్తు
ఎర్రకోట వద్ద భద్రత కట్టుదిట్టం

దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తున్న సింఘు, టిక్రీ ప్రాంతాల్లో భద్రత పెంచారు. ఎర్రకోట, లాల్ క్విలా, జామా మసీదు మెట్రో స్టేషన్ ప్రవేశ మార్గాలను మూసేశామని దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఘాజీపూర్ మార్కెట్ నుంచి దిల్లీకి వచ్చే రహదారి పూర్తిగా మూసివేశారు.

ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మక ఘటనల నేపథ్యంలో సింఘు సరిహద్దులో బుధవారం.. పటిష్ఠ బందోబస్తు
సింఘు సరిహద్దులో భారీగా మోహరించిన భద్రతా బలగాలు

ఇదీ చదవండి:'ఎర్రకోటపై జెండా ఎగురవేసిన వారు మూల్యం చెల్లించాల్సిందే'

Last Updated : Jan 27, 2021, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details