తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఖాకీ కళాకారుడికి లాఠీనే ఫ్లూటు - మురళీ గానం

కాదేది కళకు అనర్హం అని నిరూపిస్తున్నాడు కర్ణాటక లోని హుబ్బళ్లికి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్. తన వద్ద ఉన్న ఫైబర్​ లాఠీనే వేణువుగా మార్చి సహచరులకు, ఉన్నతాధికారులకు ఆనందం కలిగిస్తున్నాడు. ఆ మధుర మురళీ పలికే రాగాలకు విధి నిర్వహణలో ఉన్న ఒత్తిళ్లను మరిచిపోతున్నారు ఆ ఖాకీలు.

ఖాకీ కళాకారుడికి లాఠీనే ఫ్లూటు

By

Published : May 29, 2019, 11:54 AM IST

Updated : May 29, 2019, 12:57 PM IST

వేణువు మధుర గానం వినిపిస్తే ఎక్కడి నుంచా అని అటుగా పరుగెత్తాడు రిపోర్టర్. తేనియలొలికే మురళీ మాధుర్యత దగ్గరైన కొద్దీ పెద్ద కళాకారుడేనని అంచనాకు వచ్చాడు. అంతలోనే వేణుగానం ఆగిపోయింది. లాఠీ ఊపుకుంటూ ఎదురొచ్చాడు ఓ పోలీసాయన. ఆయనని దాటి మళ్లీ ముందుకెళ్తుండగా వెనకాలే వినిపించింది మురళీ సమ్మోహన గానం. తిరిగి చూస్తే లాఠీ కమ్ ప్లూటును వాయిస్తూ పోలీసాయన.

హుబ్బళ్లి గ్రామీణ పోలీస్​ స్టేషన్​కు చెందిన కానిస్టేబుల్ చంద్రకాంత్ హుట్గీ లాఠీనే ప్లూటుగా మార్చి వాయిస్తున్నాడు. ఫ్లూటుగా మారిన లాఠీ వేణుగానాలతో సహచరులకు శ్రవణానందం కలిగిస్తున్నాడు. మధుర మురళి పలికే రాగాలకు విధి నిర్వహణలో ఉన్న సహచరులు ఒత్తిళ్లను మరిచిపోయి ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఆయన కళకు మంత్రముగ్దులైన సహచరులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో పోలీస్​ ఉన్నతాధికారుల నుంచీ ప్రశంసలందుకొంటోంది. ఏకంగా అదనపు డీజీ భాస్కర్​ రావు ప్రత్యేక నగదు పురస్కారం ఇచ్చారని మురిసిపోతూ చెప్పారు చంద్రకాంత్.

ఖాకీ కళాకారుడికి లాఠీనే ఫ్లూటు
Last Updated : May 29, 2019, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details