తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దుబే ఎన్​కౌంటర్​పై అనుమానాలు? అసలేం జరిగింది? - up police news

కరుడుగట్టిన నేరస్థుడు వికాస్​ దుబేను ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు ఎన్​కౌంటర్​లో హతమార్చారు. అయితే ఈ ఘటనపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 5 నిమిషాల్లోనే ప్రత్యేక టాస్క్​ఫోర్స్ బృందం 45 కి.మీ దూరం ఎలా ప్రయాణించింది? బోల్తాపడ్డ వాహనం పోలీసుల కాన్వాయ్​లోకి అకస్మాత్తుగా ఎలా చేరింది? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగింది?

Questions raised over gangster Vikas Dubey's encounter
దుబే ఎన్​కౌంటర్​పై ప్రశ్నలు

By

Published : Jul 10, 2020, 10:22 PM IST

Updated : Jul 10, 2020, 11:41 PM IST

శుక్రవారం ఉదయం ఉత్తర్​ప్రదేశ్​లో మాఫియా డాన్ వికాస్​ దుబేను ఎన్​కౌంటర్​లో హతమార్చారు పోలీసులు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు సహా పలువురు యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే ఎన్​కౌంటర్​ నెపంతో దుబేను అంతమొందించారని ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వంపై సమాజ్​వాది​ పార్టీ విమర్శలు గుప్పించింది. దుబే ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పలేదని, రహస్యాలు బయటకు రాకుండా యోగి ప్రభుత్వం మాయ చేసిందని ఆరోపించింది.

పోలీసులు ఏం చెప్పారు?

యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుబేను మధ్యప్రదేశ్ ఉజ్జయిన్​ నుంచి కాన్పుర్​ తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో దుబే తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసుల వద్ద ఉన్న తుపాకీ తీసుకున్నాడు. ఆ తర్వాత అతన్ని చుట్టుముట్టిన పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుబే గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఘటన జరిగిన తీరు...

  • ఉదయం 6:16 గంటలకు దుబేను కాన్పుర్​ దేహాత్​ జిల్లా కేంద్రం మతికి తీసుకెళ్లారు.
  • 6:25 గంటలకు జిల్లాలోని అక్బర్​పుర్​ బారా​ టోల్​ ప్లాజా వద్దకు దుబే ఉన్న వాహనం వచ్చింది.
  • 6:30 గంటలకు ఎన్​కౌంటర్​లో దుబే హతమయ్యాడు.
  • దుబేను కాన్పుర్ తీసుకెళ్తున్నప్పుడు పోలీస్ కాన్వాయ్​లో 3 వాహనాలు ఉన్నాయి. ఎన్​కౌంటర్​ జరిగిన చోట రోడ్డు ప్రమాదం జరిగిన ఎస్​యూవీ వాహనం కాన్వాయ్​లో లేదు. కాన్వాయ్​తో బయలుదేరినప్పుడు మీడియా వాహనాలను అనుమతించలేదు. సచేంది ప్రాంతంలోనే ఆపివేశారు.

లేవనెత్తుతున్న ప్రశ్నలు..

  • 5 నిమిషాల్లోనే పోలీసులు 45 కి.మీ ఎలా ప్రయాణించారు?
  • అంత తక్కువ సమయంలో ఎస్​యూవీ వాహనం కాన్వాయ్​లో ఎలా చేరింది?
  • కాన్వాయ్​ను అనుసరించకుండా మీడియాను ఎందుకు ఆపారు?

దుబేను పోలీసులు ఎన్​కౌంటర్​లో హతమార్చే అవకాశాలున్నాయని, అలా జరగకుండా అతనికి యూపీ ప్రభుత్వం భద్రత కల్పించాలని గురువారం రాత్రే సుప్రీంకోర్టులో పిల్​ దాఖలవడం గమనార్హం. మహారాష్ట్రకు చెందిన న్యాయవాది ఘన్​శ్యామ్​ ఉపాధ్యాయ్​ ఈ పిటిషన్​ దాఖలు చేశారు.

అయితే దుబేను ఎన్​కౌంటర్​లో హతమార్చినందుకు యూపీ పోలీసులను ప్రశంసిస్తున్నారు కాన్పుర్​ ఘటనలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులు. అయితే ఈ ప్రశ్నలు, సందేహాలకు సమాధానం మాటేంటి?

ఇదీ చూడండి:దుబే వ్యవహారంపై న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్​

Last Updated : Jul 10, 2020, 11:41 PM IST

ABOUT THE AUTHOR

...view details