రాజస్థాన్ రాజకీయల్లో జరుగుతున్న పరిణామాలు స్పీకర్ అధికారాలపైనే పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అనర్హత నోటీసులపై ప్రశ్నించేందుకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు ఇటీవల సుప్రీం కోర్టు, రాజస్థాన్ హైకోర్టు అనుమతించింది. అనర్హత నోటీసులపై 28 ఏళ్ల క్రితమే సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం స్పష్టత నిచ్చిన నేపథ్యంలో.. మళ్లీ స్పీకర్ అధికారాల్ని ప్రశ్నించటం ఆందోళన కలిగిస్త్తోందని పేర్కొన్నారు లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారీ. ఈటీవీ భారత్తో ముఖాముఖిలో ఆయన కీలక విషయాలు పంచుకున్నారు.
" స్పీకర్ నిబంధనల ప్రకారమే నోటీసులు ఇస్తారు. ఈ నిబంధనలు 10వ షెడ్యూల్ ప్రకారం రూపొందించారు. వాటికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం పిటిషనర్ సరైన కారణంతో సంతృప్తి పరచాలి. కిహోటో హోలోహన్ కేసులో 1992లోనే సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వటంలో స్పీకర్ అధికారాలపై సుదీర్ఘ చర్చ చేపట్టింది. స్పీకర్ తుది నిర్ణయం తర్వాతే న్యాయ సమీక్ష జరగాలని, అంతకు ముందు కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది."
-పీడీటీ ఆచారీ, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్