నేపాల్ నుంచి బిహార్‌లోని తమ స్వగ్రామానికి చేరిన వలస కూలీలు.. క్వారంటైన్ సమయంలో విద్యర్థులకు ఉపయోగపడే మంచి పనిచేశారు. పశ్చిమ చంపారన్ జిల్లా రాంపుర్వ పంచాయతీలోని లక్ష్మీపుర్కు చెందిన 52 మంది వలసకూలీలు ఖాళీగా తిని పడుకోకుండా.. ప్రభుత్వ పాఠశాలను అందంగా ముస్తాబు చేశారు. భౌతిక దూరం పాటిస్తూనే.. అక్కడి మైదానాన్ని శుభ్రం చేశారు. అనంతరం పాఠశాల భవనాలకు రంగులు అద్ది.. పరిసరాల్లో పూలు, కూరగాయల చెట్లు నాటి ఆ స్కూల్‌కే వన్నె తెచ్చారు.
ప్రధానోపాధ్యాయుడి ఆనందం