కరోనా వైరస్ ప్రభావం కరెన్సీ నోట్ల ముద్రణపై పడింది. భారత సెక్యూరిటీ ప్రెస్(ఐఎస్పీ) కరెన్సీ నోట్ ప్రెస్-సీఎన్పీ)ల్లో అన్ని కార్యకలాపాలను ఈ నెలాఖరు వరకు నిలిపేశారు. ఈ మేరకు నాసిక్‌లోని భారత సెక్యూరిటీ అండ్ మింటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. అయితే ఈ రెండు యూనిట్లలో అగ్నిమాపక సిబ్బంది, భద్రత సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపింది.
కరెన్సీ నోట్లపై కరోనా ప్రభావం..! - కరోనా మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో భారత సెక్యూరిటీ ప్రెస్, కరెన్సీ నోట్ ప్రెస్‌ల్లోని అన్ని కార్యకలాపాలను మార్చి 31 వరకు నిలిపేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో అగ్నిమాపక సిబ్బంది, భద్రత సిబ్బంది మాత్రం ఉంటారని పేర్కొన్నారు.
![కరెన్సీ నోట్లపై కరోనా ప్రభావం..! Quarantine restriction violators may face 6 months prison in Karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6519200-1050-6519200-1584973592814.jpg)
కరెన్సీ నోట్లపై కరోనా ప్రభావం..!
1950 తర్వాత మళ్లీ ఇఫ్పుడే
గతంలో ఐఎస్పీ కార్మికుల నిరసనలతో 1950లో ఒక నెల పాటు ప్రెస్ మూతపడింది. 1979లోనూ కార్మికుల నిరసనల వల్ల ఐఎస్పీ, సీఎన్పీలు నెలరోజుల పాటు మూతపడ్డాయి.