తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వైద్యుల క్వారంటైన్‌ కాలాన్ని ఆన్​డ్యూటీగానే పరిగణించండి'

కరోనా నేపథ్యంలో వైద్యులు క్వారంటైన్​కు వెళ్లాల్సి వస్తే ఆ సమయాన్ని ఆన్​ డ్యూటీగానే పరిగణించాలని రాష్ట్రాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, ఆస్పత్రుల సూపరింటెండెంట్​​లకు లేఖ రాసింది.

Quarantine period of doctors to be treated as 'on duty': Health Ministry
వైద్యుల క్వారంటైన్‌ కాలాన్ని ఆన్​ డ్యూటీగానే పరిగణించండి

By

Published : Aug 11, 2020, 6:42 AM IST

కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో వైద్యులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తే ఆ సమయాన్ని విధుల్లో ఉన్నట్లుగానే (ఆన్‌ డ్యూటీగా) పరిగణించాలని రాష్ట్రాలను కేంద్ర వైద్యారోగ్యశాఖ కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లకు ఈ నెల ఆరో తేదీన లేఖ రాసింది.

కొవిడ్‌-19 విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది క్వారంటైన్‌ కాలాన్ని ఆన్‌ డ్యూటీగా పరిగణించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:పదవుల కోసం వెంపర్లాడటం లేదు: పైలట్​

ABOUT THE AUTHOR

...view details