జనాభా పెరుగుదలను అరికట్టే దిశగా చర్యలు చేపట్టింది బిహార్ ప్రభుత్వం. వైద్య పరిశీలన పూర్తి చేసుకున్న నిర్బంధ కేంద్రాల్లోని వారు ఇళ్లకు వెళ్లేటప్పుడు కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు అందిస్తోంది. నిర్బంధ కాలంలో కుటుంబ నియంత్రణ అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రకటన విడుదల చేశారు.
రెండులక్షలకు పైగా పంపిణీ..
ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 2లక్షల 14వేల కండోమ్‌లను పంపిణీ చేసినట్లు చెప్పారు మోదీ. బిహార్‌లో దశాబ్దకాలంలో జనాభా పెరుగుదల 25 శాతంగా నమోదయిన నేపథ్యంలో ఈ దిశగా చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. బాలికలకు అవగాహన కల్పించడం, బాల్యవివాహాలను అరికట్టడం వంటి చర్యలతో 4.3 శాతంగా ఉన్న గర్భధారణ రేటు 3.2కు దిగివచ్చినట్లు చెప్పారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా కండోమ్‌లను ప్రజల ఇళ్ల వద్దకే తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. 11 లక్షల గర్భనిరోధక మాత్రలను లాక్డౌన్ కాలంలో పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు మోదీ.
ఇదీ చూడండి:పానీపూరి కాదు.. మ్యాగీపూరి ఎప్పుడైనా తిన్నారా?