కర్ణాటక నాగరహోళ జాతీయ ఉద్యానం, పులుల సంరక్షణ కేంద్రంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలోని రహదారిపై వెళుతున్న జింకను తినేందుకు ఓ కొండచిలువ ప్రయత్నించింది. ఆ జింకను పూర్తిగా చుట్టుకుంది.
జింకను చుట్టేసిన కొండచిలువ.. తర్వాత ఏమైంది?
నాగరహోళ అటవీ కేంద్రంలో ఓ కొండ చిలువ బారి నుంచి జింకను రక్షించారు అధికారులు. రోడ్డుపై వెళుతున్న జింకను చుట్టుముట్టి తినేందుకు ప్రయత్నించిన కొండచిలువను చెదరగొట్టి.. దాని ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
జింకను చుట్టేసిన కొండచిలువ
కొండచిలువ బారి నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు జింక కష్టపడుతుండగా అటవీ అధికారులు గుర్తించారు. దాని పట్టునుంచి విడిపించేందుకు ప్రయత్నించి విజయవంతమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.