భారత అంతరక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లోని సదుపాయాలు ను ప్రైవేటు సంస్థలకు అందుబాటులోకి రానున్నాయి. శాటిలైట్, రాకెట్ ప్రయోగాలు, అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది కేంద్రం. గ్రహాలపై అన్వేషణ, అంతరిక్ష యాత్రలు ప్రైవేటు రంగంలోని వారికి అందుబాటులోకి రానున్నాయని చెప్పింది. ఈ మేరకు కేంద్ర అణుశక్తి, అంతరిక్ష కార్యక్రమ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటన విడుదల చేశారు.
లాక్డౌన్తో మందగమనంలో సాగుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో అంతరిక్ష ప్రయోగాల ప్రైవేటీకరణ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇస్రో సదుపాయాలను ప్రైవేటు రంగానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు మంత్రి.