తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రష్యా: తూర్పు తీర సంస్కృతులకు మోదీ ఫిదా - అధ్యక్షుడు

రెండు రోజల పర్యటనలో భాగంగా రష్యాలోని 'ది స్ట్రీట్​ ఆఫ్​ ది ఫార్​ ఈస్ట్'​ ఎక్సిబిషన్​ను సందర్శించారు మోదీ. ఈ నేపథ్యంలో కళలపై తనకున్న ఆసక్తిని ప్రధానితో పంచుకున్నారు పుతిన్​. వీరిరువురు కలిసి నేడు అంతర్జాతీయ జూడో ఛాంపియన్​షిప్​ను తిలకించనున్నారు.

రష్యా: తూర్పు తీర సంస్కృతులకు మోదీ ఫిదా

By

Published : Sep 5, 2019, 5:00 AM IST

Updated : Sep 29, 2019, 12:08 PM IST

తూర్పు తీర సంస్కృతులకు మోదీ ఫిదా

రష్యా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో కలిసి తూర్పు తీర సంస్కృతులకు అద్దంపట్టే 'ది స్ట్రీట్​ ఆఫ్ ది​ ఫార్​ ఈస్ట్​' ఎక్సిబిషన్​ను తిలకించారు. ఈ సందర్భంగా ఆటలు, వివిధ కళలపై తనకున్న ఆసక్తిని మోదీతో పంచుకున్నారు పుతిన్. అనంతరం పుతిన్​కు ధన్యవాదాలు తెలుపుతూ మోదీ ట్వీట్​ చేశారు.

మోదీ ట్వీట్​

ఆయుధ​ తయారీకి జాయింట్​ వెంచర్​...

ఏకే-203 కలష్నికోవ్​ అసాల్ట్​ రైఫల్​ తయారీ కోసం ఏర్పాటు చేసిన భారత్​- రష్యా జాయింట్​ వెంచర్​ ఆవిష్కరణపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆవిష్కరణతో ఇరు దేశాల మధ్య మిలిటరీ- సాంకేతిక రంగాల్లో ఉన్న ద్వైపాక్షిక సహకారం సరికొత్త స్థాయికి చేరిందన్నారు.

ఈ తుపాకులు భారత భద్రతా దళ బలాన్ని మరింత పెంచనున్నాయి. ఈ జాయింట్​ వెంచర్​ ఒప్పందంతో భారత్​లో సైనిక పరికరాలు తయారవుతాయని.. ఫలితంగా పారిశ్రామిక అభివృద్ధిలో దేశం ముందడుకు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని.

వీటితో పాటు రెండురోజుల పర్యటనలో భాగంగా బుధవారం రష్యా అధ్యక్షుడితో విస్త్రత స్థాయి చర్చలు జరిపారు ప్రధాని. ఇరు దేశాల మధ్య రక్షణ సహా 15 కీలక రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. పుతిన్​ ఆహ్వానం మేరకు తూర్పు ఆర్థిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మోదీ.

నేడు పుతిన్​తో కలిసి అంతర్జాతీయ జూడో ఛాంపియన్​షిప్​ను తిలకించనున్నారు మోదీ. ఇందులో భాగంగా భారత్​కు చెందిన ఆరుగురు సభ్యుల బృందంతో అగ్రనేతలు ముచ్చటించే అవకాశముంది.

ఇదీ చూడండి:- 'చెన్నై-వ్లాదివోస్తోక్ మధ్య సముద్రమార్గానికి యోచన'

Last Updated : Sep 29, 2019, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details