కేరళలోని పాలక్కడ్ ఫుట్‌బాల్ స్టేడియంలో ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాలరీ కుప్పకూలి సుమారు 50 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి స్టేడియంలో నిర్వాహకులు ఛారీటీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్‌కు అతిథులుగా ఇండియన్ ఫుట్‌బాల్ లెజెండ్స్ విజయన్, బైచింగ్ భూటియా హాజరయ్యారు.
ఫుట్‌బాల్ స్టేడియం గ్యాలరీ కూలి 50 మందికి గాయాలు - కేరళలోని పలక్కడ్ పుట్‌బాల్ స్టేడియం
కేరళలోని పాలక్కడ్ ఫుట్‌బాల్ స్టేడియంలోని గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో సుమారు 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
కేరళలో కూలిన పుట్‌బాల్ స్టేడియం గ్యాలరీ
అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన నుంచి విజయన్, బైచింగ్ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్రగాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: క్రికెట్‌తో అలరించిన భారత ప్రధాన న్యాయమూర్తి
Last Updated : Jan 20, 2020, 9:08 AM IST