పంజాబ్ బటిండా జిల్లాలోని హిమ్మత్పుర గ్రామం ఇది. అన్ని పల్లెల్లానే వ్యవసాయమే ఇక్కడి వారందరికీ జీవనాధారం. జీవనశైలి, సంస్కృతీసంప్రదాయాల పరిరక్షణ వంటి విషయాల్లోనూ అందరిలానే ఉంటారు ఇక్కడి ప్రజలు. ఒక్క విషయంలో మాత్రం హిమ్మత్పుర ఎంతో భిన్నం. ఆ గ్రామానికి ఉన్న విశిష్టత ఏంటో తెలియాలంటే... అక్కడి వీధుల పేర్లు చూడాలి.
"మా ఊరు పేరు చెబితే నాకెంతో గర్వంగా ఉంటుంది. ఇలా ఏ గ్రామంలోనూ జరగదు. మా ఊళ్లోనే మొదలుపెట్టారు. ప్రతి ఇంట్లో నామఫలకంపై మహిళ పేరే ముందు ఉంటుంది. వీధులకూ మహిళల పేర్లే ఉంటాయి. మా ఊళ్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. పూర్తి స్వేచ్ఛనిస్తారు. మా గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో మహిళలే బరిలో నిలుస్తారు. ముందు వారికే అవకాశం ఇస్తారు. మహిళనే సర్పంచిగా ఎన్నుకుంటారు."
-హిమ్మత్పుర వాసి