ప్రముఖ పంజాబీ గాయకుడు, పాప్ సింగర్ దలేర్ మెహందీ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలో కేంద్ర మంత్రి విజయ్ గోయల్, దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారీ, వాయువ్య దిల్లీ భాజపా అభ్యర్థి హన్స్ రాజ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు దలేర్. హన్స్ రాజ్‌కు దలేర్ దగ్గరి బంధువు.
పంజాబ్‌కు చెందిన ఈ పాప్ సింగర్‌కు యువతలో మంచి క్రేజ్ ఉంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సుకతతో 2013లో కాంగ్రెస్‌లో చేరారు మెహందీ. 'నహీ రుకేగీ మేరీ దిల్లీ' అంటూ సాగే అప్పటి కాంగ్రెస్ ప్రచార గీతానికి తన గాత్రం అందించారు.