పంజాబ్లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 86కి చేరింది. మృతులు పంజాబ్లోని అమృత్సర్, బటాలా, తర్న్ తరణ్ జిల్లాలకు చెందినవారు. ఈ దుర్ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శుక్రవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే న్యాయ విచారణకు ఆదేశించారు.
ఈ నెల 29 నుంచి శుక్రవారం వరకు 38 మంది చనిపోగా.. తాజాగా మృతుల సంఖ్య 86కి పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.