మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ నేత నవ్జోత్ సింగ్ సిద్ధూ ప్రకటించారు. ఈ మేరకు జూన్ 10న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించానని తెలిపారు. నెల రోజుల తర్వాత ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బహిర్గతం చేశారు సిద్ధూ. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్కు కూడా లేఖను పంపిస్తున్నానని స్పష్టం చేశారు.
శాఖ మార్పే కారణం!
పంజాబ్ మంత్రివర్గంలో పర్యటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ అమాత్యులుగా పని చేశారు సిద్ధూ. జూన్ 6న మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేశారు అమరిందర్. పర్యటకానికి బదులుగా విద్యుత్ శాఖను సిద్ధూకు కేటాయించారు. దీనిపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేశారు.