దేశ రాజధాని దిల్లీకి సమీపంలో జరుగుతున్న రైతుల నిరసనల్లో పాల్గొన్న గుర్లాబ్ సింగ్(22) అనే యువరైతు ప్రాణాలు విడిచాడు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న గుర్లాబ్ తీవ్ర మనోవేదనకు గురై విషం తీసుకున్నట్టు తెలిసింది.
పంజాబ్ యువ రైతు ఆత్మహత్య! - పంజాబ్ రైతుల నిరసనలు
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్న పంజాబ్ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణానికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
'పంజాబ్ యువ రైతు ఆత్మహత్య'
పంజాబ్లోని భటిండా జిల్లా దయాల్పురా మీర్జా గ్రామానికి చెందిన గుర్లాబ్ సింగ్ దిల్లీ నిరసనల్లో పాల్గొని శనివారమే స్వగ్రామానికి తిరిగొచ్చాడు. అదే రోజు విషం తీసుకున్న గుర్లాబ్ను బంధువులు గుర్తించి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.